భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 419 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 128 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • మూడున్నర శాతం నష్టపోయిన యాక్సిస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు ఈరోజు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటించారు. దీంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 419 పాయింట్లు కోల్పోయి 60,613కి పడిపోయింది. నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 18,028 కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.13%), భారతి ఎయిర్ టెల్ (1.09%), కోటక్ బ్యాంక్ (0.83%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.10%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-3.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.04%), టైటాన్ (-2.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.94%), బజాజ్ ఫైనాన్స్ (-2.34%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News