మాల్దీవులలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది సజీవ దహనం
- మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ సిబ్బంది
- మృతుల్లో 9 మంది భారతీయులేనని వెల్లడి
- రాజధాని ‘మలే’లో వలస కార్మికుల సంఖ్య ఎక్కువే
రాజధాని మలే లోని ఓ బిల్డింగ్ అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యిందని అధికారులు చెప్పారు. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాహనాల రిపేర్ సెంటర్ ఉండగా.. పైన ఉన్న చిన్న చిన్న గదుల్లో చాలామంది వలస జీవులు ఉంటున్నారని వివరించారు. బిల్డింగ్ లో ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి తమకు నాలుగు గంటలు పట్టిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. కాగా, అగ్ని ప్రమాద ఘటనపై మాల్దీవులలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాదం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మాల్దీవుల అధికారులతో నిరంతరం టచ్ లో ఉంటున్నట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి సంబంధించి సాయం కోసం తమను సంప్రదించవచ్చని ట్వీట్ చేసింది.