'సార్' సినిమా నుంచి ఫస్టు సింగిల్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే!
- ధనుశ్ తాజా చిత్రంగా రూపొందిన 'సార్'
- తమిళంలో 'వాతి' టైటిల్ ఖరారు
- రెండు భాషల్లోను డిసెంబర్ 2వ తేదీన విడుదల
- విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే కథ
ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు ఈ సినిమా నుంచి 'మాస్టారు ... మాస్టారు' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్వేత మోహన్ ఆలపించింది.
'సార్' సినిమాకి తమిళంలో 'వాతి' అనే టైటిల్ ను సెట్ చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సముద్రఖని .. సాయికుమార్ .. ఆడుకాలం నరేన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.