భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్... రేపు ప్రమాణస్వీకారం
- 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్
- రేపు రాష్ట్రపతి భవన్ లో సీజేఐగా ప్రమాణం చేయనున్న వైనం
- అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి కేసుల్లో తీర్పులిచ్చిన న్యాయమూర్తి
- రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ చంద్రచూడ్... సీజేఐగా ఏకంగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. 1998లో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్.. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అలహాబాద్, బాంబే హైకోర్టుల సీజేగా ఆయన పనిచేశారు. దేశంలోనే కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భ విచ్ఛిత్తి వంటి కేసుల్లో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులు ఇచ్చారు.