ప్రాక్టీస్ లో గాయపడ్డ రోహిత్ శర్మ

  • బాల్ తగిలి రోహిత్ కుడి చేతికి గాయం
  • నెట్ నుంచి బయటకు వచ్చిన కెప్టెన్
  • రోహిత్ పరిస్థితిపై ఇంకా ప్రకటన చేయని బీసీసీఐ
ఈ నెల 10న జరగనున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ తలపడబోతోంది. ఈ తరుణంలో టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ కుడి చేతికి గాయమయింది. గాయపడిన వెంటనే రోహిత్ శర్మ ప్రాక్టీస్ ను ఆపేశాడు. దీనికి సంబంధించిన పొటోలు వైరల్ అవుతున్నాయి. ఐస్ ప్యాక్ తో మర్దన చేస్తున్నట్టు ఫొటోలో ఉంది. ఆ తర్వాత ఒక బాల్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వెంటనే నెట్ నుంచి వెళ్లిపోయాడు. అయితే రోహిత్ పరిస్థితిపై బీసీసీఐ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే సెమీస్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.


More Telugu News

Rohit Sharma Team India Injury