పండంటి పాపకు జన్మనిచ్చిన అలియా భట్
- ఈ ఏడాది మొదట్లో రణబీర్ కపూర్ తో పెళ్లి
- జూన్ లో ప్రెగ్నెన్సీ విషయం ట్వీట్ చేసిన అలియా
- సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
అలియా భట్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తోటీ నటీనటులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అలియా భట్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రలో అలియా నటించారు. అలియా, ఆమె భర్త రణబీర్ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్రం ఇటీవలే తెలుగులో కూడా విడుదలైంది.
రణబీర్ కపూర్ తో కొంతకాలం డేటింగ్ లో ఉన్న అలియా.. ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలకు ప్రెగ్నెన్సీని అలియా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. అప్పట్లో ఆసుపత్రిలో పరీక్షలకు సంబంధించిన ఓ ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.