కేటీఆర్ నడిపిన బైక్ 29 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు... ఇదిగో ఫొటో!
- 1994లో నిజాం కాలేజీలో విద్యార్థిగా కేటీఆర్
- కేటీఆర్ నాడు వాడిన సుజుకీ బైక్ ను పోస్ట్ చేసిన జాన్సన్
- 24 ఏళ్లుగా ఇదే బైక్ ను వాడుతున్నట్లుగా చెప్పిన వైనం
- జాన్సన్ పోస్ట్ చూసి అమితాశ్చర్యానికి గురైన కేటీఆర్
24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఈ బైక్ నడిపిన రీతిలో ఇప్పుడు కూడా కేటీఆర్ తో కలిసి బైక్ పై తిరగాలని ఉందంటూ జాన్సన్ తన పోస్టులో తెలిపాడు. ఈ పోస్ట్ ను చూసినంతనే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఆ బైక్ నే నాడు వాడారు. నాడు కేటీఆర్ నుంచి తీసుకున్న ఆ బైక్ ను జాన్సన్ ఇప్పటికీ వాడుతుండటం నిజంగా ఆశ్చర్యకరమే.