Pawan Kalyan: మల్లె తోటలో పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan talks to Jasmine farmers and agri labour
షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన వాడీవేడిగా సాగింది. గ్రామంలో కూల్చివేతల బాధితులతో మాట్లాడిన అనంతరం తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటం-పెద వడ్లమూడి మార్గమధ్యంలో ఉన్న మల్లె తోటల వద్ద పవన్ కల్యాణ్ తన కాన్వాయ్ ని ఆపారు. 

మల్లె తోటల్లో పనిచేస్తున్న రైతులు, కూలీల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్లె సాగు రంగం గురించి వారితో మాట్లాడారు. జనసేన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ అని పవన్ కల్యాణ్ వారికి వివరించారు. 

దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళా కూలీ తన గోడు చెప్పుకుని కన్నీటి పర్యంతం కాగా, పవన్ ఆమెను ఓదార్చారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jasmine Farms
Farmers
Labour
Ippatam

More Telugu News