హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లలో అధికారం మళ్లీ బీజేపీదే!: ఎగ్జిట్ పోల్స్
- గుజరాత్ లో కూడా కమల వికాసమే
- 125కు పైగా సీట్లను గెలుచుకుంటుంది
- హిమాచల్ లో 41 సీట్లలో బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు
- ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి
హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో 46 శాతం ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుతారని, 41 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ‘ఇండియా టీవీ-మాట్రిక్స్’నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 25 సీట్లతో సరిపెట్టుకుంటుందని, ఆ పార్టీ 42 శాతం ఓట్లు సాధిస్తుందని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో బోణీ కొట్టలేదని, ఆ పార్టీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే పడతాయని వెల్లడైంది. మిగతా రెండు సీట్లను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకుంటారని ఈ పోల్ తేల్చింది.
గుజరాత్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వే తేల్చింది. రాష్ట్రంలో 45 శాతం ఓట్లతో బీజేపీ 125 నుంచి 135 మధ్యలో అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ 21 శాతం ఓట్లతో 29-33 సీట్లను, ఆమ్ ఆద్మీ పార్టీ 29 శాతం ఓట్లతో 20-24 సీట్లు గెలుచుకుంటాయని తేల్చింది. ఏబీపీ-సీవోటర్ సర్వేలో కూడా గుజరాత్ పీఠం బీజేపీదేనని తేలింది.