బిగ్ బాస్ హౌస్ లో 59వ రోజు .. తన ఆటతీరుతో ఆసక్తిని రేకెత్తించిన గీతూ!
- 59వ రోజుకి చేరుకున్న 'బిగ్ బాస్ 6'
- రెడ్ టీమ్ .. బ్లూ టీమ్ గా విడిపోయిన పోటీదారులు
- గీతూ వేసిన మాస్టర్ ప్లాన్
- ఆదిరెడ్డి టీమ్ కి షాక్
రెడ్ టీమ్ కి గీతూ లీడర్ అయితే .. బ్లూ టీమ్ కి ఆదిరెడ్డి లీడర్. అందువలన ఆదిరెడ్డిని గేమ్ నుంచి పక్కకి తప్పించాలని గీతూ ప్లాన్ చేస్తుంది. అర్థరాత్రివేళ అతను నిద్రలో ఉండగా .. అతను రహస్యంగా దాచిన డ్రెస్ నుంచి గీతూ స్ట్రైప్స్ ను కొట్టేస్తుంది. వాటిని భద్రంగా దాచే బాధ్యతను శ్రీహాన్ కి అప్పగిస్తుంది. ఈ మొత్తం డ్రామాలో ఆమె ఫైమా సాయం తీసుకుంటుంది. ఇక అలా గీతూ బెడ్ పైకి చేరుకోగానే, ఆదిరెడ్డి టీమ్ చెందిన ఇనయా నిద్ర లేస్తుంది. అప్పటికి తెల్లారిపోతుంది గానీ ఎవరూ నిద్రలేవరు. గీతూ టీమ్ దాచిన గ్రెనైడ్స్ ను ఇనయా దొంగిలించి, జైల్లోని వాష్ రూమ్ లో దాచేస్తుంది. అక్కడైతే ఎవరూ కనిపెట్టలేరని ఆమె అనుకుంటుంది.
మరుసటి రోజు ఆదిరెడ్డి నిద్ర లేచి తన డ్రెస్ పై స్టైప్స్ లేకపోవడం చూసి షాక్ అవుతాడు. అది గీతూ పనేనంటూ వాదనకి దిగుతాడు. ఈ సమయంలోనే తాము దాచుకున్న గ్రెనైడ్స్ కనిపించడం లేదనే విషయం గీతూకి తెలుస్తుంది. ఆది రెడ్డి టీమ్ వాళ్లు ఆ గ్రెనైడ్స్ ను ఎక్కడ దాచి ఉంటారా అని ఆలోచించిన గీతూ, జైల్లోని వాష్ రూమ్ కి వెళ్లి .. అక్కడ ఇనయా రహస్యంగా దాచిన గ్రెనైడ్స్ ను బయటికి తెచ్చేస్తుంది. ఈ మొత్తం డ్రామా అంతా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. గీతూ తెలివితేటలను .. చురుకుదనాన్ని ఆవిష్కరించే ఎపిసోడ్ గా ఇది కనిపిస్తుంది. ఇక ఆ తరువాత ఆదిరెడ్డి చేసే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందనేది ఈ రోజు రాత్రికిగానీ తెలియదు.