నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • మార్కెట్లపై ప్రభావం చూపిన ఫెడ్ రేట్ల పెరుగుదల
  • 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 30 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెంపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 60,836కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 18,052 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.89%), టైటాన్ (1.53%), భారతి ఎయిర్ టెల్ (1.05%), టాటా స్టీల్ (0.99%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.95%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.04%), ఎన్టీపీసీ (-1.47%), ఇన్ఫోసిస్ (-1.41%), విప్రో (-1.33%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News