'ప్రధాని పదవి ఆశించే ముందు సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవండి' అంటూ రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్
- కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలను రాహుల్ అపహాస్యం చేయడం విడ్డూరంగా ఉందన్న కేటీఆర్
- 2019ల్ అమేథీలో ఓడిపోయి వయనాడ్ స్థానంలో గెలిచిన రాహుల్
- తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అమేథీలో సొంత పార్లమెంట్ స్థానంలో కూడా గెలవలేని అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేశారు. ప్రధాని అవ్వాలనుకుంటున్న వ్యక్తి ముందుగా తనను ఎంపీగా ఎన్నుకునేలా సొంత ప్రజలను ఒప్పించాలి’ అని ట్వీట్ చేశారు. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, కేరళ లోని వయనాడ్ స్థానం నుంచి గెలవడంతో ఆయన పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.