Rahul Gandhi: 'ప్రధాని పదవి ఆశించే ముందు సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవండి' అంటూ రాహుల్​ గాంధీపై కేటీఆర్​ సెటైర్

Wannabe PM should first convince his people to elect him as an MP setires ktr on rahul gandhi
  • కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలను రాహుల్ అపహాస్యం చేయడం విడ్డూరంగా ఉందన్న కేటీఆర్
  • 2019ల్ అమేథీలో ఓడిపోయి వయనాడ్ స్థానంలో గెలిచిన రాహుల్
  • తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును విమర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ నేత, ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ తన సొంత నియోజకవర్గం అమేథీలో ఎంపీగా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏడు రోజులు రాహుల్ గాంధీ తెలంగాణలో పాద యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై విమర్శలు చేశారు. 

దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అమేథీలో సొంత పార్లమెంట్ స్థానంలో కూడా గెలవలేని అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేశారు. ప్రధాని అవ్వాలనుకుంటున్న వ్యక్తి ముందుగా తనను ఎంపీగా ఎన్నుకునేలా సొంత ప్రజలను ఒప్పించాలి’ అని ట్వీట్ చేశారు. 2019లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే, కేరళ లోని వయనాడ్ స్థానం నుంచి గెలవడంతో ఆయన పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Rahul Gandhi
KTR
counter
KCR
BRS
Congress

More Telugu News