హీరో విశాల్ ను పెళ్లి చేసుకోబోతోందనే వార్తలపై సినీ నటి అభినయ స్పందన!
- గతంలో సినీ నటి వరలక్ష్మి ప్రేమలో ఉన్న విశాల్
- ఆ తర్వాత హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం
- ఇప్పుడు అభినయతో ప్రేమలో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం
ఇప్పుడు విశాల్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నాడని... వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. ఈ వార్తలపై విశాల్ ఇంత వరకు స్పందించలేదు. తాజాగా అభినయ ఈ అంశంపై స్పందిస్తూ.. ఇందులో నిజం లేదని తెలిపింది. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో విశాల్ కు భార్యగా నటిస్తున్నానని... సినిమాలో భార్యగా నటించినంత మాత్రాన రియల్ లైఫ్ లో కూడా భార్య అయిపోతానా? అని చమత్కరించింది. దీంతో, ఈ పుకార్లకు తెర పడినట్టయింది.