ఉన్నపళంగా వెళ్లిపోండి.. ఉక్రెయిన్ లోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక
- అందుబాటులో ఏ వాహనం ఉంటే అందులో వెళ్లిపోవాలని సూచన
- ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వెల్లడి
- దేశాన్ని వీడేందుకు అవసరమైనోళ్లకు సాయం చేస్తామని హామీ
ఇప్పటికీ అక్కడే ఉన్న విద్యార్థులు..
రష్యా దురాక్రమణ ప్రారంభమైన కొత్తలో ఉక్రెయిన్ లోని విద్యార్థుల్లో చాలామందిని భారత ప్రభుత్వం దేశానికి తీసుకొచ్చింది. అక్కడ సెటిలైన భారతీయులతో పాటు మరికొందరు విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతుండడం, మధ్యలో దాడుల తీవ్రత కొంత తగ్గడంతో యూనివర్సిటీలు తెరుచుకున్నాయి. విదేశాలకు వెళ్లిపోయిన విద్యార్థులు తిరిగి రావాలని సూచించాయి. దీంతో రెండు, మూడు నెలల క్రితం భారత విద్యార్థులు మరోమారు ఉక్రెయిన్ వెళ్లారు. ఈలోపు రష్యా దాడులు తీవ్రం చేయడం, రాజధాని కీవ్ సహా ముఖ్యమైన నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడడంతో అక్కడున్న విద్యార్థులతో పాటు భారత దేశంలో ఉన్న వాళ్ల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్ల కోసం ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల 19న అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్ వీడాలని అందులో సూచించింది. దీంతో కొంతమంది దేశం వదలగా.. మరికొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు.