భారత్ లో ఒకేసారి 8 కొత్త బైకులను లాంచ్ చేసిన 'ట్రయంఫ్'...అయితే...!
- భారత్ లో జోరు ప్రదర్శిస్తున్న బ్రిటీష్ బైకుల కంపెనీ
- క్రోమ్ ఎడిషన్ పేరిట వివిధ మోడళ్ల ఆవిష్కరణ
- లిమిటెడ్ ఎడిషన్ అని పేర్కొన్న ట్రయంఫ్
- ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడి
అయితే ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు. ఒక ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటాయి. 2022 చివరి నాటికి లేదా, 2023 ఆరంభంలో ఈ కొత్త బైకులు డీలర్ల వద్దకు చేరుకోనున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో ట్రయంఫ్ గోల్డ్ లైన్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ బైకులు ఆవిష్కరించింది. వీటికి భారత మార్కెట్లో మంచి స్పందన లభించడంతో ఉత్సాహంతో ఉన్న ట్రయంఫ్ అదే ఊపులో ఇప్పుడు క్రోమ్ ఎడిషన్ తీసుకువచ్చింది. వీటి ధరలు రూ.8.84 లక్షల నుంచి రూ.21.40 లక్షల ధర పలకనున్నాయి.