నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్లో జరిగిన అత్యాచారం నన్ను బాగా కలచివేసింది: చిరంజీవి
- హైదరాబాదు డీఏవీ స్కూల్లో చిన్నారిపై లైంగికదాడి
- ప్రిన్సిపాల్ కారు డ్రైవరే నిందితుడు
- ఘటనపై స్పందించిన చిరంజీవి
- కఠినాతి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్
నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలచివేసినట్టు వెల్లడించారు. అటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు.