బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ కు శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ

Modi congratulates Britain new PM Rishi Sunak
  • బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
  • కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు మోదీ వెల్లడి
  • బ్రిటన్ లోని భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా రిషి సునాక్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2030 రోడ్ మ్యాప్ అమలు, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. భారత్, బ్రిటన్ మధ్య చారిత్రక సంబంధాలు ఇకపై ఆధునిక తరం భాగస్వామ్యంలోకి అడుగుపెడుతున్నాయని మోదీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్ లోని భారతీయులు ఇరుదేశాల మధ్య మానవ వారధి లాంటి వారని అభివర్ణించారు.
Go Back to Shorts
Rishi Sunak
Narendra Modi
Prime Minister
Britain
India

More Telugu News