టీ20 ప్రపంచ కప్ సూపర్12 మ్యాచ్.. ఆసీస్ కు భారీ టార్గెట్ ఇచ్చిన న్యూజిలాండ్
- 20 ఓవర్లలో 200/3 స్కోరు చేసిన కివీస్
- భారీ ఇన్నింగ్స్ తో చెలరేగిన డేవాన్ కాన్వే
- రాణించిన ఫిన్ అలెన్
మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 56 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) సహకారంతో కాన్వే దూకుడు కొనసాగించాడు. రెండో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ (12) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. చివర్లో జిమ్మీ నీషమ్ (13 బంతుల్లో 3 సిక్సర్లతో 26 నాటౌట్) మెరుపులతో కాన్వే కివీస్ స్కోరు 200 మార్కు దాటించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ (2/41) రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా (1/39) ఒక వికెట్ పడగొట్టాడు.