Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ మోదీపై కేటీఆర్ సెటైర్లు

KTR satires on Modi after Liz Truss resignation
  • విఫల ఆర్థిక విధానాల కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారనే వార్తతో ఆనందించానన్న కేటీఆర్
  • మన ప్రధాని అత్యధిక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇచ్చారని వ్యాఖ్య
  • రూపాయి విలువను పతనం చేశారని ఎద్దేవా
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేవలం 45 రోజులు మాత్రమే ఆమె ప్రధానిగా కొనసాగారు. బ్రిటన్ చరిత్రలోనే అతి తక్కువ కాలం పని చేసిన ప్రధానిగా ఆమె అపకీర్తిని మూటకట్టుకున్నారు. పన్ను కోతలపై గత నెల ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ తో మార్కెట్లు కుదేలు కావడం, డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ రికార్డు స్థాయికి పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు. మరో వైపు లిజ్ ట్రస్ రాజీనామాను ఉటంకిస్తూ ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. 

తన విఫలమైన ఆర్థిక విధానాల కారణంగా 45 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసినట్టు చదివి ఆనందించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశంలో కూడా ఒక ప్రధాని ఉన్నారని... ఆయన మనకు ఏం ఇచ్చారంటే... 30 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్ల కాలంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచంలో అతి ఎక్కువ గ్యాస్ ధర, అమెరికా డాలరుతో పోలిస్తే అతి తక్కువ రూపాయి విలువ అంటూ ఎద్దేవా చేశారు.
KTR
TRS
Liz Truss
UK
Narendra Modi
BJP

More Telugu News