Rahul Gandhi: మీరు ఏ సన్ స్క్రీన్ వాడతారంటూ అడిగిన కార్యకర్తలు... రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే...!

Congress workers asks Rahul Gandh which sunscreen he uses
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగించగా, దానికి సంబంధించిన ఓ వీడియోను పార్టీ సోషల్ మీడియా విభాగం నేడు విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ముచ్చటించడం ఈ వీడియోలో చూడొచ్చు. పాదయాత్ర ముగిసిన తర్వాత సాయంత్రం వేళ తమకు ఏర్పాటు చేసిన శిబిరంలో రాహుల్ పార్టీ కార్యకర్తల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆ వివరాలు ఇవిగో...

రాహుల్ గాంధీ: అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
కార్యకర్తలు: 100 శాతం ఆరోగ్యంగా ఉన్నాం సర్.
ఓ కార్యకర్త: చాలా దూరం నడుస్తుంటాం కాబట్టి బొబ్బలు వంటి సమస్యలు ఉంటాయి.
రాహుల్ గాంధీ: మీలో ఎవరికైనా బొబ్బలు వచ్చాయా?
ఓ మహిళా కార్యకర్త: నాకెలాంటి బొబ్బలు రాలేదు.
రాహుల్ గాంధీ: నాక్కూడా రాలేదు.
ఓ కార్యకర్త: మీరు ఏ సన్ స్క్రీన్ క్రీమ్ వాడతారు?
రాహుల్ గాంధీ: నేను ఏ సన్ స్క్రీన్ వాడను. మా అమ్మ (సోనియా గాంధీ) ఓ సన్ స్క్రీన్ క్రీమ్ పంపింది కానీ, నేను దాన్ని వాడడంలేదు.
Go Back to Shorts
Rahul Gandhi
Sunscreen
Congress
Bharat Jodo Yatra
Karnataka

More Telugu News