వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
- వివేకా కేసును ఏపీ బయట విచారించాలంటూ సునీతా రెడ్డి పిటిషన్
- రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
- కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
- నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపణ
వివేకా హత్య కేసును ఏపీ బయట విచారించాలని దాఖలు చేసిన పిటిషన్ లో సునీతారెడ్డి చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని సీబీఐ తన కౌంటర్ లో పేర్కొంది. ఏపీ పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారని, ఈ కారణంగానే కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపింది. నిందితులు చెప్పినట్లు స్థానిక పోలీసులు వ్యవహరించారని చెప్పింది. ఈ కేసును విచారిస్తున్న అధికారిపైనే స్థానిక నిందితులు కేసు పెట్టారని పేర్కొంది. తాము చెప్పినట్లుగా స్టేట్ మెంట్ ఇస్తానన్న అధికారి శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చారని తెలిపింది.