చెత్తలో దొరికిన వజ్రం.. ఈ ‘గోల్డెన్ కనరీ’ రూ.123 కోట్లు పలుకుతుందట
- ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు వజ్రంగా గుర్తింపు
- ప్రస్తుతం దుబాయ్ లోని సోత్ బీ వేలం శాలలో ప్రదర్శన..
- డిసెంబర్ ఏడో తేదీన న్యూయార్క్ లో వేలం వేయనున్న సోత్ బీ సంస్థ
కాంగోలోని గనిలో దొరికి..
1980లో కాంగో దేశంలోని ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ తవ్విన గనికి సంబంధించిన మట్టిలో ఈ గోల్డెన్ కనరీ వజ్రం దొరికింది. ఆ చిన్నారి ఈ రాయిని తీసుకెళ్లి ఇంటి యజమానికి ఇచ్చింది. అది వజ్రమని గుర్తించిన ఆయన.. స్థానిక వజ్రాల వ్యాపారికి అమ్మి డబ్బులు తీసుకున్నాడు. ఆ సమయంలో దాని బరువు ఏకంగా 890 క్యారెట్లు కావడం గమనార్హం. అంటే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వజ్రం అన్నమాట.
సానబెడుతుంటే చిన్నగా అయిపోయి..
ఆ వజ్రం చేతులు మారుతూ, సానపెట్టే క్రమంలో ముక్కలు అవుతూ వచ్చింది. వాటిలో ప్రస్తుతమున్న పెద్ద ముక్కను ‘గోల్డెన్ కనరీ’ వజ్రంగా పిలుస్తున్నారు. దీని బరువు 303.1 క్యారెట్లు. ప్రస్తుతం దీనిని దుబాయ్ లోని సోత్ బీ వేలం శాలలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్ ఏడో తేదీన న్యూయార్క్ లోని సోత్ బీ వేలం శాలలో ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు. దీనికి కనీసం రూ.123 కోట్లకుపైగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.