వరుసగా మూడో రోజూ లాభాల జోరును కొనసాగించిన మార్కెట్లు

Markets ends in profits
  • 550 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 175 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతం వరకు పెరిగిన ఎస్బీఐ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల జోరును కొనసాగించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఫైనాన్షియల్ పాలసీని బ్రిటన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడి 58,961కి ఎగబాకింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 17,487కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.41%), ఐటీసీ (2.39%), నెస్లే ఇండియా (2.38%), భారతి ఎయిర్ టెల్ (2.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.95%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.72%), ఎన్టీపీసీ (-0.68%), టెక్ మహీంద్రా (-0.24%), సన్ ఫార్మా (-0.16%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.15%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News