నైజీరియాను కుదిపేస్తున్న వర్షాలు.. 600 మంది మృత్యువాత
- గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు
- నిరాశ్రయులుగా మారిన 13 లక్షల మంది
- వచ్చే నెలాఖరు వరకు కొనసాగనున్న వర్షాలు
వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు ఇప్పటికైనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నైజీరియా మంత్రి సదియా ఉమర్ ఫరూఖ్ కోరారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల ఇళ్లు కొట్టుకుపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాగా, వచ్చే నెలాఖరు వరకు వర్షాలు, వరదలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.