KA Paul: అయాం డాక్టర్ కేఏ పాల్.. బీ కేర్ పుల్ అంటూ పోలీసు అధికారిపై కేఏ పాల్ ఫైర్.. వీడియో ఇదిగో

  • మునుగోడు ఉపఎన్నికలో కేఏ పాల్ ముమ్మర ప్రచారం
  • మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడంటూ ఒక పోలీస్ అధికారిపై ఆగ్రహం
  • టీఆర్ఎస్ ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని ప్రశ్న
KA Paul fires on police officer

మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ ఆయనపై మండిపడ్డారు. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని... నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు. 

'నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో... అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్' అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా తన పట్ల చాలా గౌరవంగా ఉంటారని చెప్పారు. తాను శాంతిదూతనని రేవంత్ చెప్పారని... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న తనతో ఎంత బాగా వ్యవహరించారో చూడలేదా? అని అడిగారు.

More Telugu News