Vishnu Vardhan Reddy: ఒక్క ఎమ్మెల్యే లేకున్నా ఏపీలో ఇంత అభివృద్ధి చేస్తున్నాం... అధికారంలో ఉంటే ఇంకెంత చేసేవాళ్లమో ఆలోచించండి: విష్ణువర్ధన్ రెడ్డి

  • రైల్వే ప్రాజెక్టులపై స్పందించిన ఏపీ బీజేపీ నేత
  • దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడి
  • తమది మాటల ప్రభుత్వం కాదనివ్యాఖ్యలు
BJP leader Vishnu comments

ఏపీలో రైల్వే ప్రాజెక్టుల అంశంపై స్పందిస్తూ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ఒక్క ఎమ్మెల్యే లేకున్నా ఏపీలో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అదే గనుక ఏపీలో బీజేపీ అధికారంలో ఉండుంటే ఇంకెంత అభివృద్ధి చేసేవాళ్లమో ఆలోచించండి అని పేర్కొన్నారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైందని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కనెక్టవిటీ ప్రాజెక్టులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. 

ఈ క్రమంలో విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్... గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుద్దీకరణ విజయవంతంగా పూర్తి చేసిందని, ఈ మార్గాల్లో రైళ్ల సర్వీసులను కూడా ప్రారంభించిందని తెలిపారు. 

ఆరవల్లి-నిడదవోలు మధ్య 32.8 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు నిన్నటితో పూర్తయ్యాయని, తద్వారా ఆ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ తో నిరాటంకంగా రైలు సర్వీసుల నిర్వహణకు వీలవుతుందని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల మౌలిక వసతుల బలోపేతంతో పాటు సరకు, ప్రయాణికుల రవాణా అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

More Telugu News