నరేంద్ర ఆరోపణల్లో వాస్తవం లేదు.. ప్రకటన విడుదల చేసిన సీఐడీ
- తనను హింసించారంటూ న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన నరేంద్ర
- తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారన్న సీఐడీ
- నిందితుడు ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలు చెరిపేశారన్న అధికారులు
నిందితుడు నరేంద్ర ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెట్టినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నరేంద్ర తన సెల్‌ఫోన్‌లోని సాక్ష్యాలను చెరిపివేసినట్టు గుర్తించామన్నారు. దీంతో ఈ కేసులో 201 సెక్షన్ ను చేర్చి నిందితుడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని సీఐడీ తెలిపింది.