మహిళల ఆసియా కప్లో ఏడోసారి ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
- సెమీస్ లో థాయ్ లాండ్ పై ఘన విజయం
- సత్తా చాటిన షెఫాలీ, దీప్తి, రాజేశ్వరి
- 74 పరుగుల తేడాతో చిత్తయిన థాయ్ జట్టు
అనంతరం 149 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన థాయ్ లాండ్ ఓవర్లన్నీ ఆడి 74/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ చైవాల్ (21), నటాయ (21) మాత్రమే కాసేపు పోరాడారు. ఈ ఇద్దరు తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (3/7) నాలుగు ఓవర్లలో ఏడే పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ (2/10) రెండు వికెట్లు పడగొట్టింది. దాంతో, ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరుకున్న థాయ్ లాండ్ అక్కడే తన పోరాటాన్ని ముగించింది. పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ శనివారం ఫైనల్లో పోటీ పడుతుంది.