ఆ ఇద్దరు రాజకీయ నాయకులంటే తనకు చాలా ఇష్టమన్న చిరంజీవి.. ఎవరంటే?
- ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ ప్రశ్నకు సమాధానం చెప్పిన చిరు
- లాల్ బహదూర్ శాస్త్రి, వాజ్ పేయి గొప్ప నాయకులన్న మెగాస్టార్
- ఈ కాలంలో గొప్ప నాయకులు ఎవరంటే తన దగ్గర సమాధానం లేదని వ్యాఖ్య
ఈ సినిమా పొలిటికల్ డ్రామా కావడంతో... మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? అని పూరి జగన్నాథ్ అడిగారు. ప్రశ్నకు చిరంజీవి ఇబ్బంది పడకుండా ఏ జనరేషన్ నాయకులైనా సరే అని అన్నారు. దీనికి సమాధానం ఇచ్చిన చిరు.. ఈ జనరేషన్ లో ఇష్టమైన నాయకులు ఎవరంటే తన దగ్గర సమాధానం లేదన్నారు. పాత కాలంలో చాలా మంది గొప్ప నాయకులు ఉన్నారని, పార్టీలకు అతీతంగా వాళ్లంటే తనకు ఇష్టమని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్ పేయి తనకు ఇష్టమైన నాయకులు అని చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టిన రోజునే జన్మించిన శాస్త్రి ఆయనలానే ఉంటారన్నారు. వాజ్ పేయి నిజమైన రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. ఈ ఇద్దరి నాయకత్వంలో మన దేశం చాలా పురోగతిని సాధించిందన్నారు.