దాగుడు మూతలు ఆడుతున్న కుక్కపిల్లలు. వెరైటీగా ఉందంటూ నెటిజన్ల కామెంట్స్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాగుడు మూతలు ఆడుతున్న కుక్కపిల్లలు. వెరైటీగా ఉందంటూ నెటిజన్ల కామెంట్స్‌

Two dogs playing hide and seek
  • ట్విట్టర్ లో వైరల్ గా మారిన కుక్కపిల్లల వీడియో
  • ఒక కుక్కపిల్ల వెతుకుతుంటే.. మరొకటి గోడ చాటుకు దాక్కుని ఎదురుచూసిన తీరు
  • వెతుకుతూ దగ్గరికి రాగానే ఒక్కసారిగా భౌ అంటూ దూకిన వైనం
  • ‘మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయంటూ’ నెటిజన్ల కామెంట్లు
చిన్నప్పుడు దాగుడు మూతలు అడటం సాధారణమే. ఇప్పటికీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు దాగుడు మూతలు ఆడుతుంటారు. వారితో కలిసి మనమూ ఆడుతుంటాం. అయితే రెండు చిన్న కుక్కపిల్లలు దాగుడు మూతలు ఆడుతుండటం ఎప్పుడైనా చూశారా? అదెట్లా అలాంటివి మనుషులు మాత్రమే చేయగలరు అంటారా.. కానీ ఇలా రెండు కుక్కపిల్లలు దాగుడు మూతలు ఆడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గోడ పక్కన దాక్కుని భయపెట్టి..
రెండు కుక్కపిల్లలు దాగుడు మూతలు ఆడుతున్న వీడియోను ట్విట్టర్ లో డానీ డెరనీ అనే ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఒక కుక్కపిల్ల ఇంకో దాని కోసం వెతుకుతుండగా.. మరొకటి ఓ గోడ పక్కన దాక్కుని ఎదురుచూస్తోంది. అలా కాసేపు ఎదురు చూసిన తర్వాత.. మొదటి కుక్కపిల్ల మెల్లగా అటువైపు వచ్చింది. అది దగ్గరికి రాగానే దాక్కున్న కుక్కపిల్ల భౌ అంటూ దానిపైకి దూకింది. రెండూ సరదాగా అడుతూ పరుగెట్టాయి. ‘‘రెండు కుక్కపిల్లలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. శునకాలు మంచి జంతువులు” అని క్యాప్షన్ పెట్టారు.
  • ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షా 26 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. వందల కొద్దీ లైకులు వస్తున్నాయి. కుక్కపిల్లలు క్యూట్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.
  • ‘‘కుక్క పిల్లలు దాగుడు మూతలు ఆడటం అద్భుతం. మనుషుల్లా భలే సరదాగా ఆడాయి”అంటూ కొందరు అంటుంటే.. “సో స్వీట్.. ఇది చూస్తే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 
  • ‘‘ఈ వీడియో చూడగానే మనసులో టెన్షన్ ఎగిరిపోయి సరదాగా అనిపించింది. వీడియో పెట్టినందుకు థాంక్స్” అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.
Dogs
Hide and seek
Game
Twitter
Viral Videos
Offbeat

More Telugu News