కార్యకర్తల బీమా కోసం రూ.26.11 కోట్ల ప్రీమియం చెల్లించిన టీఆర్ఎస్
- ఏడేళ్లుగా కార్యకర్తలకు బీమా ప్రీమియం చెల్లిస్తున్న టీఆర్ఎస్
- ఏడేళ్లలో ఇందుకోసం రూ.66 కోట్లు వెచ్చించిన పార్టీ
- ఈ ఏడాది ప్రీమియం చెక్కును బీమా సంస్థలకు అందించిన కేటీఆర్
టీఆర్ఎస్ అందిస్తున్న బీమా ప్రకారం ప్రమాదంలో మృతి చెందే కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా సొమ్ము అందనుంది. అదే సమయంలో ప్రమాదాల్లో పూర్తి స్థాయి అంగవైకల్యం కలిగితే రూ. 1 లక్ష, పాక్షిక అంగవైకల్యానికి రూ.50 వేలు అందనున్నాయి. ఇందుకోసం గడచిన ఏడేళ్లలో పార్టీ తరఫున రూ.66 కోట్లను వెచ్చించినట్లు కేటీఆర్ తెలిపారు.