ఈ నెల 15 నుంచి ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌... 16న విశాఖలో జ‌న‌వాణి

janasena chief pawankalyan tours north andhra from 15th of this month
  • ఈ నెల 15,16, 17 తేదీల్లో ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌
  • విశాఖ జ‌న‌వాణిలో ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించ‌నున్న వైనం
  • ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన నేత‌ల‌తో కీల‌క స‌మావేశం
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉత్తరాంధ్ర‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 15న ఉత్త‌రాంధ్ర చేర‌నున్న ప‌వ‌న్... మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్క‌డే ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌సేన జ‌న‌వాణిని ఆయ‌న నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు స్వీక‌రించ‌నున్నారు. అనంత‌రం ఉత్త‌రాంధ్ర‌కు చెందిన పార్టీ ముఖ్య నేత‌ల‌తో ఆయ‌న భేటీ కానున్నారు.
Go Back to Shorts
Janasena
Vizag
Pawan Kalyan
Janavani
North Andhra

More Telugu News