అనుష్క చేస్తున్న సినిమా కూడా అదే పాయింట్ చుట్టూ తిరుగుతుందట!
- షూటింగు దశలో అనుష్క సినిమా
- నిర్మాణ సంస్థగా యూవీ
- ముఖ్యమైన పాత్రలో నవీన్ పోలిశెట్టి
- సరోగసి చుట్టూ తిరిగే కథ అంటూ టాక్
ఈ సినిమాలో అనుష్క ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉండగా, ముఖ్యమైన పాత్రలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. కొంతకాలంగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా టీమ్ తెగ టెన్షన్ పడుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వారి కంగారుకు కారణం 'స్వాతిముత్యం' సినిమా అంటున్నారు.
'స్వాతిముత్యం' కథ అంతా కూడా వీర్యదానం - సరోగసి అనే పాయింట్ చుట్టూ కామెడీని టచ్ చేస్తూ నడుస్తుంది. కామెడీని పక్కన పెడితే, అనుష్క సినిమా కథాంశం కూడా ఇదేనని అంటున్నారు. దాంతో 'స్వాతిముత్యం' కథకి దగ్గరగా ఉందే అనే మాట రాకుండా ఈ సినిమా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.