టీజర్ ను చూసి ఒక అంచనాకు రావద్దు.. ఎవరినీ నిరాశ పరచను: 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్
- ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్'
- టీజర్ ను చూసి నిరాశకు గురవుతున్న ఫ్యాన్స్
- సినిమా అందరినీ అలరిస్తుందన్న ఓం రౌత్
వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల అవుతుందని... సినిమా చూసిన వారెవరూ నిరాశ చెందరని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ కోసమే రాముడి పాత్రను రాశానని... కథ రాస్తున్నంత సేపు తన మైండ్ లో ప్రభాసే ఉన్నాడని చెప్పారు. ప్రభాస్ కోసం ఈ సినిమాను తెరకెక్కించానని.. ప్రభాస్ నో చెప్పి ఉంటే సినిమా చేసే వాడిని కాదని అన్నారు. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పారు.