బాలయ్యతో పొలిటికల్ డ్రామా ప్లాన్ చేసిన బోయపాటి!
- బాలయ్యకి వరుస హిట్లు ఇచ్చిన బోయపాటి
- 'అఖండ' సీక్వెల్ కోసం అభిమానుల వెయిటింగ్
- అంతకుముందే మరో ప్రాజెక్టు చేసే ఆలోచనలో బోయపాటి
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య
- వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి
'అఖండ' సీక్వెల్ కంటే ముందుగా బాలయ్య - బోయపాటి మరో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ డ్రామాతో కూడిన యాక్షన్ తో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఆల్రెడీ బోయపాటి కథ చెప్పడం .. బాలయ్య ఓకే అనడం జరిగిపోయాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 2024 సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. ఇది మాస్ యాక్షన్ జోనర్లో రూపొందుతోంది. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఫ్యామిలీ డ్రామా చేయనున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, ఆ తరువాత ఆయన బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళతారన్న మాట.