Samsung: తక్కువ ధరలో శామ్ సంగ్ నుంచి మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్

Samsung India launches yet another affordable Galaxy A series smartphone details here
  • గెలాక్సీ ఏ04ఎస్ విడుదల
  • 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో డిస్ ప్లే
  • దీని ధర రూ.13,499
  • ఎస్ బీఐ కార్డుపై రూ.1,000 క్యాష్ బ్యాక్
శామ్ సంగ్ తక్కువ ధరకే మంచి ఫీచర్లతో గెలాక్సీ ‘ఏ04ఎస్’ స్మార్ట్ ఫోన్ ను భారత వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ గా వస్తుంది. దీని ధర రూ.13,499. ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో దీన్ని రూ.12,499కే సొంతం చేసుకోవచ్చు. 

ఈ ఫోన్ శామ్ సంగ్ సొంత ప్రాసెసర్ అయిన ఎక్సినోస్ 850తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన, హెచ్ డీ ప్లస్ ఇన్ఫినిటీ వీ డిస్ ప్లే తో ఇది వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో ప్రైమరీ కెమెరా సెన్సార్ సామర్థ్యం 50 మెగాపిక్సల్స్. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో ఉంటుంది. పవర్ బటన్ దగ్గరే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు. డాల్మీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. బ్లాక్, కాపర్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
Samsung
launched
smart phone
budget price
Galaxy A04s

More Telugu News