ఉక్రెయిన్ కు పెను సవాల్.. విరుచుకుపడుతున్న ఇరాన్ డ్రోన్లు
- ఇరాన్ మేడ్ షాహెద్-136 డ్రోన్లను ప్రయోగిస్తున్న రష్యా
- ఈ డ్రోన్లను రష్యాకు తాము సరఫరా చేయలేదన్న ఇరాన్
- కీవ్ కు సమీప ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి
మరోవైపు దీనిపై ఇరాన్ స్పందిస్తూ... తాము రష్యాకు డ్రోన్లను సరఫరా చేయలేదని తెలిపింది. మరోవైపు ఇరాన్ డ్రోన్లను ఉపయోగించారనే వార్తలపై రష్యా మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇంకోవైపు ఈ డ్రోన్ దాడులపై 80 ఏళ్ల ఒలోదిమిర్ అనే వృద్ధుడు స్పందిస్తూ... తీవ్ర భయాన్ని వ్యక్తం చేశారు. కర్ణకఠోరంగా ఉన్న భారీ శబ్దాలు వచ్చాయని ఆయన తెలిపారు. తొలుత తాను పేలుడు శబ్దాన్ని విన్నానని... ఆ తర్వాత పేలుడును కళ్లారా చూశానని చెప్పారు.
దక్షిణ ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి రష్యా ఈ డ్రోన్ దాడులు చేసిందని ఉక్రేనియన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ఆరు డ్రోన్లను మార్గమధ్యంలోనే కూల్చేశామని చెప్పారు. ఈ డ్రోన్లు తమ అన్ని డిఫెన్స్ ఫోర్సెస్ కు పెను సవాలని... వీటిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని అన్నారు.