శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ను అరెస్ట్ చేయాలంటూ మహిళా కమిషన్ ఆదేశాలు
- సీఐ అంజూ యాదవ్ వీడియో వైరల్
- ఓ మహిళపై దౌర్జన్యం చేస్తున్నట్టుగా దృశ్యాలు
- తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్
- సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు
ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కొన్నిరోజుల కిందటే తిరుపతి ఎస్పీకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ను ప్రశ్నించారు. కావాలని దాడి చేయలేదంటూ సీఐ వివరణ ఇచ్చారు. తన వాదనలకు బలం చేకూర్చేలా ఓ ఆడియో విడుదల చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఆ మహిళ తన పట్ల అమర్యాదగా మాట్లాడిందని అంజూ యాదవ్ ఆరోపించారు. ఆమెను తాను కొట్టలేదని స్పష్టం చేశారు.