గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు దక్కేవి రెండు సీట్లేనట: ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే
- డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
- వరుసగా ఏడోసారి కూడా బీజేపీదే విజయమన్న ఒపీనియన్ పోల్
- ఎన్నికల్లో ఆప్ ప్రభావం ఉంటుందని తేల్చిన వైనం
- కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 44 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా
- బీజేపీకి మాత్రం 143 స్థానాలు వస్తాయంటున్న ఒపీనియన్ పోల్
గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 99 స్థానాలను కైవసం చేసుకోగా ఈసారి 135 నుంచి 143 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్న ఒపీనియన్ పోల్.. ఆప్‌కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఇక్కడ మొత్తం 68 స్థానాలు ఉండగా అందులో బీజేపీకి 37 నుంచి 45 సీట్లు వస్తాయని అంచనా వేసింది.