28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు.. చివరి భార్య ఫిర్యాదుతో అరెస్ట్
- పశ్చిమ బెంగాల్ లో ఘటన
- పెళ్లయిన కొన్నాళ్లకు డబ్బు, నగలతో పరార్
- పలు పేర్లతో బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో తిరుగుతూ యువతులకు వల
నకిలీ గుర్తింపు కార్డులతో బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అమాయక మహిళలను వలలో వేసుకునే వాడు. ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అయ్యేవాడు. ఇలా మొత్తం 23 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారందరినీ మోసగించి ఇంట్లోంచి డబ్బు, నగలు తీసుకుని పరారయ్యేవాడు. మోసపోయినట్టు గుర్తించిన వారందరూ ఫిర్యాదుకు ముందు రాకపోయినప్పటికీ 24వ మహిళ ధైర్యం చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.