Raviteja: 'టైగర్ నాగేశ్వరరావు'లో రేణు దేశాయ్ పవర్ఫుల్ రోల్ .. పోస్టర్ రిలీజ్

  • 18 ఏళ్ల తరువాత రేణు దేశాయ్ రీ ఎంట్రీ
  • 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్ర
  • 'హేమలత లవణం' పాత్ర పరిచయంతో పోస్టర్ రిలీజ్ 
  • వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు
Tiger Nageshwara Rao Movie Update

రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం ఇటు ప్రజలకు .. అటు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది. 

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రేణు దేశాయ్ పోషిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను .. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'హేమలత లవణం' పాత్రలో కనిపిస్తారనీ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు. 18 సంవత్సరాల తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇది అంటూ మరింత ఆసక్తిని పెంచారు. 

 ప్రస్తుతం రవితేజ 'ధమాకా' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నాడు. ఆ తరువాత లైన్లో 'రావణాసుర' సినిమా ఉంది. ఈ రెండు సినిమాల తరువాత 'టైగర్ నాగేశ్వరరావు' థియేటర్లకు రానుంది. అంటే వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సినిమా ప్రేక్షకులకు పలకరిస్తుందని అనుకోవాలి.

More Telugu News