మాంద్యం భయాలు.. ఈరోజు మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు
- 509 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 148 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతం వరకు పడిపోయిన ఐటీసీ షేర్ విలువ
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టపోయి 56,598కి పడిపోయింది. నిఫ్టీ 148 పాయింట్లు కోల్పోయి 16,858కి దిగజారింది. హెల్త్ కేర్, ఐటీ, టెక్, ఆటో సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. మరోపక్క, ఆసియా-పసిఫిక్ మార్కెట్లన్నీ ఈరోజు నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (2.90%), సన్ ఫార్మా (2.21%), డాక్టర్ రెడ్డీస్ (2.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.42%), నెస్లే ఇండియా (1.23%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.97%), యాక్సిస్ బ్యాంక్ (-2.84%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.64%), టాటా స్టీల్ (-2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.07%).