మహేశ్ బాబు మాతృమూర్తికి నివాళి అర్పించిన కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు మాతృమూర్తికి నివాళి అర్పించిన కేటీఆర్

KTR pays tributes to Indira Devi
  • తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఇందిరాదేవి
  • మహేశ్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్
  • ఈ మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరగనున్న అంత్యక్రియలు
సినీ నటుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఇందిరాదేవి మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు. నాగార్జున, మోహన్ బాబు, గోపీచంద్, అల్లు అరవింద్ తదితరులు కూడా నివాళి అర్పించారు. ఈ తెల్లవారుజామున ఆమె అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇందిరాదేవి అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
KTR
TRS
Mahesh Babu
Mother
Condolence

More Telugu News