సుప్రీంలో ఉద్ధవ్ థాకరేకు ఎదురుదెబ్బ.. ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ పై స్టేకు నిరాకరణ!
- తమదే అసలైన శివసేనగా గుర్తించాలని ఎన్నికల సంఘానికి షిండే విజ్ఞప్తి
- ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఉద్దవ్ సుప్రీంలో పిటిషన్
- నేడు విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
- అసలైన శివసేనను గుర్తించే హక్కు ఈసీకి ఉందన్న కోర్టు
ఈ క్రమంలో దీనిని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో ఎన్నిక సంఘం ముందుకు వెళ్లకుండా, ఈసీ ప్రొసీడింగ్స్ పై స్టే విధించాలని కోరారు. దీనిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించింది. అసలైన శివసేన ఏది అన్న విషయాన్ని నిర్ధారించే హక్కు, అర్హత రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘానికే ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరే పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.