Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పండుగ అమ్మకాల్లో శాంసంగ్ సంచలనం.. ఆదివారం ఒక్క రోజే 12 లక్షల ఫోన్ల విక్రయం

Samasung Creates New Record On Festival Sale
  • ఒక్క రోజే రూ.1000 కోట్లకుపైగా విలువైన ఫోన్ల అమ్మకం
  • శాంసంగ్ ఫోన్ల విక్రయాల్లో టాప్ లేపిన అమెజాన్
  • బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌గా గెలాక్సీ ఎం 13 మోడల్
పండుగ అమ్మకాల్లో శాంసంగ్ రికార్డు సృష్టించింది. ఆదివారం ఒక్క రోజే ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఏకంగా రూ. 1000 కోట్ల విలువైన దాదాపు 12 లక్షల ఫోన్లను విక్రయించింది. పండుగ విక్రయాలలో భాగంగా పలు రాయితీలు ప్రకటించిన శాంసంగ్ అమ్మకాల్లో పోటీ సంస్థలను వెనక్కి నెట్టేసింది. శాంసంగ్ ఫోన్ల అమ్మకాల్లో అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో తమ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ పరిధి రెండింతలు పెరిగినట్టు శాంసంగ్ తెలిపింది.

అమ్ముడైన శాంసంగ్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్20, ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎం53, గెలాక్సీ ఎం33, గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎం 13 మోడళ్లు ఉండగా, గెలాక్సీ ఎం 13 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మిడ్ రేంజ్‌లో లభిస్తున్న 5జీ ఫోన్.

శాంసంగ్ గెలాక్సీ ఎం 13 స్పెసిఫికేషన్లు

6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు 8 ఎంపీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌ యూఐ కోర్ 4 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్/ 64 జీబీ అంతర్గత మెమరీ వేరియంట్ ధర రూ. 9,499 కాగా,  6జీబీ/ 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.11,499 మాత్రమే. ఇందులో 5జీ వేరియంట్ 4జీబీ/64 జీబీ వేరియంట్ ధర రూ. 11,499 కాగా, ఇందులో 6జీబీ/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 13,999.
Samsung
Amazon
Flipkart
Samsung Galaxy M13

More Telugu News