హైదరాబాదులో టీ20 మ్యాచ్ ఫీవర్... శంషాబాద్ చేరుకున్న టీమిండియా, ఆసీస్ క్రికెటర్లు
- టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్ ల సిరీస్
- చివరి టీ20 మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యం
- ఈ నెల 25న నిర్ణయాత్మక మ్యాచ్
- మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అభిమానులు
మ్యాచ్ టికెట్ల రగడ తప్పిస్తే, నగరంలో టీ20 ఫీవర్ జోరుగా వ్యాపించింది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో దిగిన వారు అక్కడ్నించి నేరుగా తమకు బస ఏర్పాటు చేసిన పార్క్ హయత్ హోటల్ కు వెళ్లిపోయారు. కాగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు హోటల్ తాజ్ కృష్ణలో వసతి ఏర్పాటు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు కూడా ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి కిందట శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.