దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లపై ప్రశంసల జల్లు కురిపించిన 'ది కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు
- 'సీతారామం' సినిమాను నిన్న రాత్రి చూశానన్న వివేక్ అగ్నిహోత్రి
- దుల్కర్ నటన రిఫ్రెషింగ్ గా ఉందని ప్రశంస
- మృణాల్ పెద్ద స్టార్ అవుతుందని కితాబు
హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమాను నిన్న రాత్రి చూశానని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. దుల్కర్ నటన చాలా రిఫ్రెషింగ్ గా, అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. తొలిసారి మృణాల్ ఠాకూర్ నటనను చూశానని... చాలా ఫ్రెష్ గా, సహజంగా ఉందని కొనియాడారు. మృణాల్ పెద్ద స్టార్ అవుతుందని చెప్పారు. ఈ మేరకు వివేక్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.