మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు సోమవారం ఓ అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 25న నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ ఆ ఆహ్వానం అందింది. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ స్వయంగా ఈ ఆహ్వానాన్ని ఆమెకు అందించారు.
తనకు అందిన ఆహ్వానాన్ని ట్విట్టర్ వేదికగా గవర్నర్ పంచుకున్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హెచ్‌సీఏ సభ్యులతో కలిసి తమిళిసైని అజార్ ఆహ్వానించారు.