ఐఫోన్12 పై భారీ ఆఫర్ ప్రకటించిన అమెజాన్
- 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 40 వేల లోపే అని ప్రకటన
- బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్‌లతో రూ. 30 వేలకే లభించే అవకాశం
- ఈనెల 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్
ఈనెల 23న ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ సందర్భంగా, స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను అమెజాన్ అందుబాటులో ఉంచింది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్చేంజ్ ఆఫర్‌లతో ఐ ఫోన్12 (128 జీబీ)ని రూ. 30 వేలకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ లెక్కన 64 జీబీ మోడల్ రూ. 30 లోపే ఉండేలా కనిపిస్తోంది.